Saturday, May 4, 2024

పదేళ్ల చరిత్రను ప్రపంచానికి చాటుదాం

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : అరవై ఏళ్ల వలస పాలనలో ఆగమైనం..ఆంధ్రాపాలకుల చేతిలో అన్నింటా అరిగోసబడ్డం..దగా పడ్డ గుండెల దందు గట్టినం..ఆంధ్రపెత్తనంపై దండోరమోగించినం…ఉద్యమ నాయకుడు కెసిఆర్ చావు అంచులోకెల్లి సబ్బండ వర్గాల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిల్చిండు.. అమరుల ఆత్మ బలిదానాల సాక్షిగా సకల జనుల తెలంగాణను సాధించుకున్నాం..నెర్రెలు వారిన తెలంగాణ బీడు భూములు నేడు -పచ్చని మాగాణులైనవి పాడి పంటలతో, ధాన్యపు సిరులతో తెలంగాణ యావత్ సంబరపడుతుంది..14 ఏళ్ల సుదీర్ఘ స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఫలాలను పొందుతున్న తరుణం.. సొంత పాలన కాంక్ష నెరవేరి దశాబ్దం దారిలోకి వచ్చిన తరుణంలో యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పదేళ్ల పండుగను గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో సంబరాలను అంబరాన్ని అంటేలా జరుపుకుందామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ఘన కీర్తిని ప్రపంచానికి చాటేలా దశాబ్ది వేడుకలను జరుపుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సిఎం కెసిఆర్ సారథ్యంలో ప్రగతి వైపు పరుగెడుతున్న పదేళ్ల చరిత్రను ప్రపంచానికి చాటుదామని అన్నారు. పల్లె పల్లెలో తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరుపుకుందామని అన్నారు. జూన్ 2న ప్రారంభమవుతున్న ఉత్సవాలలో అమర వీరులకు నివాళులర్పిస్తారని పల్లె పల్లెలో జాతీయ జెండాను ఎగరవేసి దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే అన్నారు. దశాబ్ది వేడుకలలో రెండవ రోజు తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతామని, తెలంగాణ రాష్ట్రంలో సాధించిన రైతు ప్రగతిని రాష్ట వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. జూన్ 4న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని అభినందించేలా సంబరాలు జరుపుకోవాలని అన్నారు. జూన్ 5వ తేదీన తెలంగాణ విద్యుత్ విజయోత్సవం జరుపుతారని, జూన్ 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుందని, జూన్ 7వ తేదీన సాగునీటి ఉత్సవం నిర్వహిస్తారన్నారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహించాలని ఎమ్మెల్యే అన్నారు. అలాగే జూన్ 8న ఊరూర చెరువుల పండుగ నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే అన్నారు. 9వ తేదిన తెలంగాణ సంక్షేమ సంబరాలను నిర్వహించుకుందామని, 10వ తేదీన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహిస్తారని అన్నారు. జూన్ 12న తెలంగాణ రన్, 13న తెలంగాణ మహిళా సంక్షేమం, 14న తెలంగాణ వైద్యారోగ్య ఉత్సవం, 15వ తేదీన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం, 17వ తేదీన తెలంగాణ గిరిజనోత్సవం, 18న తెలంగాణ నీళ్ల పండుగ, 19వ తేదీన తెలంగాణ హరితోత్సవం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. జూన్ 20న తెలంగాణ విద్యాదినోత్సం, జూన్ 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవ, 22న అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News