Sunday, April 28, 2024

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Light to heavy rains across in Telangana

హైదరాబాద్: రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఉందని అధికారులు పేర్కొ న్నారు. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా 3.1 ఎత్తున ఇది ఆవరించి ఉందని, దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.

Light to heavy rains across in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News