Thursday, May 9, 2024

మార్కెట్ తూకాల్లోహెచ్చతగ్గులు

- Advertisement -
- Advertisement -

weight Fluctuations in kirana stores in Greater Hyderabad

నష్టపోతున్న వినియోగదారులు
పట్టించుకోని తూనికలు కొలతల శాఖ అధికారులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో సాధారణ కిరాణ షాప్ మొదలు సూపర్ మార్కెట్ వరకు తప్పుడు తూకంతో వినియోగదారులకు టోకరా వేస్తున్నాయి. పప్పులు నుంచి కాయగూరలు, పాలు,నూనే,చికెన్,మటన్ ఏది కొన్నా వినియోగదారులు నిలువుదోపిడికి గురవుతన్నారు. కిలో కొనుగో చేస్తే వచ్చేంది 850 నుంచి 900 గ్రామలు మాత్రమే ,అదే విధంగా లీటర్ కొంటనే 800 నుంచి 900 మిల్లీ గ్రాములు మాత్రమే వస్తున్నాయి. సాధారణ త్రాసుల నుంచి ఎలక్ట్రానిక్ ,డిజిటల్ తూకం, యంత్రాల దాక, దేనిపై తూచినా తూకాల్లో మాత్రం మోసాలు ఆగక పోవడంతో వినియోగదారులు నిత్యం దోపడికి గురవుతున్నారు. తూకాల్లో అక్రమాలను నియంత్రించాల్సిన అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లుగా మొక్కబడిగా తనిఖీలు నిర్వహిస్తూ సల్వ జరిమానా విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

రోజులు మారండంతో మార్కెట్‌లోలో తక్కెడ త్రాసులు తగ్గిపోయాయి. ఎలక్ట్రానిక్,డిజిటల్ తూకాలు అందుబాటులోకి వచ్చినా చేతికి వాటం మాత్రం ఆగడం లేదు. ఎలక్ట్రానిక్ మిషన్ తూకం డిస్‌ప్లేచూపిస్తుంది కావునా మోసం జరగదని వినియోగదారులు భావిస్తుంటారు. కానీ తక్కెడ, త్రాసు కంటే ఎలక్ట్రానిక్ తూకంలోనే మోసాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. వినియోగదారులకు అనుమానం రాకుండా యంత్రంలో ట్యాపరింగ్ చేసి దోపడికి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఎలక్ట్రానిక్ మిషన్ ఖాళీగా ఉన్నప్పుడు డిస్‌స్లే సున్నా బరువు చూపిస్తుంది. తర్వాత సరుకుల బరువు పెట్టి లెక్కిస్తారు. ఎలక్ట్రానిక్ యంత్రానికి ఆప్షన్ మార్చడం ద్వారా తక్కువ సరులకు పెట్టినా ఎక్కువ బరువు డిస్‌స్లే కనిపించే విధంగా చేతివాటం ప్రదర్శిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.ఎలక్ట్రానిక్ తూకంపై 10 కిలోల బరువు పెడితే10 కిలోల బరువు ఉన్నట్లు డిస్‌ప్లే అవుతుంది. అదే 10 కిలోలబరువును 11 కిలోలుగా డిస్‌ప్లే అవుతుంది.

దీన్ని బట్టి చేతివాటంతో సర్దుబాటు చేసిన దాని ప్రకారం డిస్‌ప్లే అవుతుంది. ఇక సంత మార్కెట్‌లలో ఏది కొన్నా తక్కువ తూకమే చూపిస్తుంది. కిలో కూరగయాలు, పండ్లు, మటన్, చికెన్, చేపలు వంటి వాటివి ఏవి కొన్నా 800 నుంచి 900 గ్రాములకు మించవు పప్పు ధాన్యాలు కొన్నా ఇదే పరిస్థితి ఉంటుంది. 25 కిలోల బియ్యం బస్తాల్లో బియ్యం బరువు 23 నుంచి 24 కిలోకు మించదు. ఇక పండ్లు చేపల మార్కెట్‌లో క్వింటాళ్ళలో 10 కిలోలు కోత ఉంటుంది. నగరంలోని సికింద్రాబాద్, గడ్డిన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట, ముషీరాబాద్, రాంనగర్, మార్కెట్‌లలో తూకాల్లో చేతివాటం అధికంగా కనిపిస్తోంది. ఇంత జరుగుతన్నా అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తుండటంతో వ్యాపారుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఇక నైన అధికారులు ఈ అంశం ప్రత్యేక దృష్టి సారించి వ్యాపారులు మోసాల నుంచి వినియోగదారులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేక పోతే వ్యాపారుల చేతుల్లో వినియోగదారు మోసపోతూనే ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News