Friday, April 26, 2024

ఆధార్‌కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానానికి అందుబాటులోకి తపాలాశాఖ సేవలు

- Advertisement -
- Advertisement -

Postal services available for mobile number integration with Aadhaar card

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆధార్‌కార్డుతో మొబైల్ నెంబరు అనుసంధానం లేదా ఫోన్ నంబర్ మార్పులాంటి వాటికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా తపాలాశాఖ ఈ సేవలను ఇంటి దగ్గరే అందిస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా ఇంటి నుంచే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్‌చేస్తే చాలు తపాలా సిబ్బంది ఇంటికే వచ్చి ఈ పని చేసి పెడతారు. తపాలాశాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ సేవ ప్రస్తుతం జనాలను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆధార్‌తో ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానించుకోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. చాలామంది ఈ పనికోసం ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడ క్యూలో నిలబడి పని చేయించుకోవాల్సి వస్తోంది.

కానీ, ఏ ఇబ్బందులు లేకుండా, ఫోన్‌చేస్తే తపాలా సిబ్బందే ఇంటికి వచ్చి మనకు అనుకూలమైన సమయంలో వీటిని అనుసంధానం చేసి వెళ్తారు. ఇప్పటికే నంబర్ అనుసంధానమై ఉన్నప్పుడు, ఫోన్ నెంబర్ మారినా, కొత్త నెంబర్‌తో అనుసంధానించుకోవాలనుకున్నా తపాలా సిబ్బంది ఆ సేవలను కూడా అందిస్తారు. ఒక్కో అనుసంధానానికి రూ.50 చొప్పున తపాలా సిబ్బంది దీనికి చార్జీ వసూలు చేస్తారు. సంబంధిత పోస్టాఫీసు పోస్టుమాస్టర్ లేదా పోస్ట్‌మేన్‌కు ఫోన్‌చేస్తే ఇంటికి వచ్చి ఈ సేవలను అందిస్తారని తపాలాశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News