Monday, May 6, 2024

చేతులెత్తేసిన బల్దియా!

- Advertisement -
- Advertisement -

వీధి వ్యాపారులకు మొండిచెయ్యి
25 శాతం మందికే పిఎం స్వనిధి రుణాలు
రుణాల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు

vegetables

మన తెలంగాణ /సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలో వీధి వ్యాపారుల రుణాలకు సంబంధించి దేవుడు వరమిచ్చినా, పూజారి కనకరించని చందంగా పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుగులు గురైన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు రూ.10 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం కింద రుణాల రూపంలో బ్యాంకుల ద్వారా అందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఎం స్వనిధి మైక్రోక్రెడిట్ పథకం అమల్లో బల్దియా అధికారుల అలసత్వం చిరు వ్యాపారులకు శాపంగా మా రింది.

కేంద్రం ఆదేశాలతో ఈ పథకం కిందబ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా జిహెచ్‌ఎంసి అధికారులు లబ్ధ్దిదారులకు ఇప్పించడంలో బల్దియా మాత్రం విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో అన్ని మూత పడడంతో వ్యాపారాలు నడవక వీధి వ్యాపారులు జీవనోపాధి కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా చిన్నాభిన్నమైన పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

ఇదే సమయంలో వా రిని ఆదుకునేందుకు గత ఏడాది జూలై 2న కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అంతలోనే తిరిగి సెంకడ్ వేవ్ కూడా రావడంతో పరిస్థితులు మరింత దిగజారి వారి బతుకులు ఛిద్రంగా మారాయి. అయితే గత మార్చి వరకు ఈ పథకంపై కొంత దృష్టి సారించినా జిహెచ్‌ఎంసి అధికారులు ఈ ఆర్ధిక సంవత్సరంలో మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం లక్షలాది మంది వీధి వ్యాపారులు రుణాల కోసం ప్రైవేట్ ఫైనాన్సర్లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా మరింత నష్టపోతున్నారు.

గుర్తించిన వీధి వ్యాపారుల్లో 25 శాతం మందికే రుణాలు

గ్రేటర్ పరిధిలో దాదాపుగా 3లక్షలపైగా వీధి వ్యాపారాలు ఉంటే వారిలో జిహెచ్‌ఎంసి గుర్తించింది మాత్రమే 60 శాతం లోపే. అందులోను గుర్తించిన 1.60లక్షల మందిలో తక్షణ ఆర్ధిక సహాయం కింద రూ. 10వేల చోప్పున కేవలం 25 శాతం మందికే ఇప్పటీ వరకు అధికారులు రు ణాలు ఇప్పించడం గమన్హారం. గత మార్చి చివరినాటికి గ్రేటర్ వ్యాప్తంగా 1,62,105 మంది వీధి వ్యాపారులను గుర్తించిన బల్దియా ఇందులో 1, 54,335 మందికి గుర్తింపు కార్డులను జారీ చేసింది. గడిచిన 4 నెలల కాలంలో కేవలం మరో 5వేల మంది వీధి వ్యాపారులను మాత్రమే గుర్తించినట్లు సమాచారం. అయితే గుర్తించిన 1.67 వేల మందిలో ఇప్పటి వ రకు 1.60లక్షల మందికి గుర్తింపు కార్డులను జారీ చేసినట్లు తెలిసింది . అదేవిధంగా అధికారుల లెక్కల ప్రకారమే గత మార్చి నాటికి లోన్ల కోసం 67,233 మంది దరఖాస్తు చేసుకోగా అప్పట్లో ఇందులో కేవలం 34,878 మందికి మాత్రమే రుణాలను జిహెచ్‌ఎంసి ఇప్పించగల్గింది. ఈ తర్వాత సెంకడ్ వేవ్ విజృంభణతో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించడం, తిరిగి వ్యాపారాలన్ని మూత పడడంతో అప్పటికే ఆర్ధికంగా పూర్తిగా నష్ట పోయినా వీధి వ్యాపారులు రుణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకునేందుకు ముందుకు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. కొత్త రుణాలు పక్కన పె డితే గత మార్చినాటికే మంజూరైన 42,911 మందిలో రుణాలు పొందిన 34,878 మందిపోను మిగిలిన 8,033 మందిలో కూడా ఇప్పటి వరకు కేవలం 4వేల మందికి మాత్రమే రుణాలు ఇప్పించినట్లు సమాచారం. దీం తో జిహెచ్‌ఎంసి గుర్తించని 1.40 లక్షల మందితో పాటు బల్దియా గుర్తింపు కార్డులు పొందిన మరో లక్షమంది రుణాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి గ్రేటర్‌లో నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News