Friday, April 26, 2024

నల్లగొండలో నడిరోడ్డుపై లారీ దగ్ధం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నడి రోడ్డుపై లారీ దగ్ధమైన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలో జరిగింది. రసాయన పదార్థాలతో కూడిన లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తుండగా వాహనంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి బయటకు దూకారు. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పోలీసులు పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News