Friday, April 26, 2024

వాయిదా పడిన ‘లవ్ స్టోరి’

- Advertisement -
- Advertisement -

Love Story Movie Release date postponed

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. అయితే, ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ‘లవ్ స్టోరి’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ “లవ్ స్టోరి చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేసేందుకు చాలా సంతోషంగా ఎదురుచూశాం. అయితే, కొవిడ్ కేసుల పెరుగుదల వల్ల ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మంచి డేట్ చూసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం”అని అన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్లో సినిమాను ఎప్పుడు చూద్దామా అని వేచి చూశాం. అయితే రెండు, మూడు రోజుల నుంచి కొవిడ్ పరిస్థితి గమనిస్తున్నాం. కొవిడ్ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. కరోనా కేసుల సంఖ్య తగ్గిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం”అని పేర్కొన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ “ప్రస్తుతం కరోనా అనేది బాగా వ్యాపిస్తోంది. కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి పరిస్థితిలో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాం”అని తెలిపారు.

Love Story Movie Release date postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News