Wednesday, May 8, 2024

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…. యువతి మృతి…

- Advertisement -
- Advertisement -

Lovers commit suicide in warangal rural

వరంగల్: ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో జరిగింది. యువతి మృతి చెందగా యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికుల సమాచారం మేరకు… వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేటకు చెందిన ఓ కుటుంబ బతుకుదెరువు కోసం మహబూబాబాద్ జిల్లా కేసమద్రానికి వలస వెళ్లారు. గూడురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఆ కుటుంబంతో చనువుగా ఉంటున్నాడు. మాయమాటాలతో మైనర్ బాలికను ప్రేమలోకి దించాడు. బాలిక కుటుంబ సభ్యుల వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. నెక్కొండలోని వట్టెవాడు సమీపంలోని పంచముఖి అంజనేయ స్వామి గుడి వద్ద పురుగుల మందు తాగారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతి చెందగా యువకుడు ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు పోలీసులకు మాత్రం విషయం తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News