Saturday, May 4, 2024

కరోనా కేసులు పెరుగుతున్నాయి: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Maharashtra has more than 1 lakh active cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలోనే లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. కేసులు ఎక్కువగా వస్తున్న 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలోనే ఉన్నాయని తెలిపింది. కేరళ, యుపిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్రం చెప్పింది. దేశంలో కరోనా మరణాల రేటు తగ్గుతోందని, రికవరీ రేటు పెరుగుతోందని స్పష్టం చేసింది. కరోనాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు దేశంలో ఇప్పటివరకు 2.56 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని రోజులూ కోవిడ్ టీకాలు లభ్యమవుతున్నాయని పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారంలో కనీసం 4 రోజులు కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నట్టు సూచించింది. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహాసర్కార్ నాగ్ పూర్ లో పూర్తి లాక్ డౌన్ విధించింది.

Maharashtra has more than 1 lakh active cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News