Wednesday, May 15, 2024

షిరిడీలో భక్తులకు ఇక రోజుకు 10 వేల ఉచిత ఆఫ్‌లైన్ పాసులు

- Advertisement -
- Advertisement -

Maharashtra Shirdi Temple allows 10000 devotees per day

షిరిడి(మహారాష్ట్ర): రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల తగ్గుముఖం పట్టడంతో ప్రముఖ పుణ్య క్షేత్రం షిరిడి సాయిబాబా దర్శనానికి ఉచిత ఆఫ్‌లైన్ పాసుల ద్వారా రోజుకు 10 వేల మంది భక్తులను అనుమతించాలని అహ్మద్‌నగర్ జిల్లా పాలనాయంత్రాంగం నిర్ణయించింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రతిరోజూ 15 వేల మంది భక్తులను ఆన్‌లైన్ పాసుల ద్వారా సాయిబాబా దర్శనానికి అనుమతిస్తుండగా ఆఫ్‌లైన్ పాసుల ద్వారా మరో 10 వేల మందిని అనుమతించాలని పాలనా యంత్రాంగం తాజాగా నిర్ణయించింది. దీంతో ఇక ప్రతిరోజు 25 వేల మందిని సాయిబాబా దర్శనానికి అనుమతిస్తారు. కరోనా మహమ్మారి రాకకు ముందు రోజూ లక్షలాది మంది భక్తులు షిరిడీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించేవారు. కాగా.. ఉచిత ఆఫ్‌లైన్ పాసుల పంపిణీ కోసం షిరిడీలో కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు తెలిపింది. భక్తులు తమ ఆధార్ కార్డులు చూపించి ఈ పాసులను పొందవచ్చని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News