Wednesday, May 15, 2024

73% తగ్గిన మహింద్ర లాభాలు

- Advertisement -
- Advertisement -
mahindra
మూడో త్రైమాసికంలో రూ.380 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: దేశీయ ఆటో దిగ్గజం మహింద్ర, మహింద్ర సంస్థ నికర లాభాలు 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోఅంతకు ముందు ఏడాదితో పోలిస్తే 73 శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ పన్ను చెల్లింపు అనంతరం రూ.1396 కోట్ల నికర లాభం ఆర్జించగా, ఇప్పుడు అది రూ.380 కోట్లకు పడిపోయింది.ట్రాకర్లతో పాటుగా వాహనాల అమ్మకాలు తగ్గడమే నికర లాభాలు తగ్గడానికి ప్రధాన కారణమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మరో వైపు గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తూ కంపెనీ రెవిన్యూ ఇప్పుడు కొద్దిగా తగ్గింది.

గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రాబడి రూ.12,893 కోట్లు ఉండగా ఇప్పుడది రూ.12,120 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో వాహనాల అమ్మకాలు 1,33,508 ఉండగా ఇప్పుడు1,23,353 వాహనాలు మాత్రమే అమ్ముడు పోయాయి. అంటే 8 శాతం తగ్గాయి. అలాగే ట్రాక్టర్ అమ్మకాలు సైతం 6 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 87,036 ట్రాక్టర్లు అమ్ముడు కాగా, ఇప్పుడు 81,435 మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక ఇంతకు ముందుతో పోలిస్తే ఇపుడు ట్రాక్టర్లు, వాహనాల ఎగుమతులు 22 శాతం తగ్గాయి. గతంలో 12,363 యూనిట్లు ఎగుమతి కాగా ఇప్పుడు 9,633 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి.

అయితే మూడో త్రైమాసికంలో భారత ఆటో, ట్రాక్టర్ రంగంలో తిరిగి వృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో ఈ రంగంలో రెండంకెల వృద్ధి నమోదైందని ఎంఅండ్ ఎం ఆ ప్రకటనలో తెలిపింది. వర్షాలు బాగా కురవడం, పండగ సీజన్ డిమాండ్, మెరుగుపడిన ద్రవ్య లభ్యత, కొత్త వాహనాలు ముఖ్యంగా యుటిలిటీ విభాగంలోఆవిష్కరణలు, ఆటో పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలుదీనికి ప్రధాన కారణాలని కంపెనీ తెలిపింది.

mahindra net profit plunge 73 per cent

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News