Tuesday, April 30, 2024

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

- Advertisement -
- Advertisement -

make-in-india

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత
దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి

కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు దోహదం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి కరోన వైరస్ కారణంగా చైనా నుండి అనేక ఉత్పత్తుల దిగుమతిని అకస్మాత్తుగా నిషేధించాల్సి వచ్చింది. దీంతో దేశీయ కంపెనీలు తమ వస్తువుల ఉత్పత్తిని పెంచాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ వైద్య రంగంలో చూడవచ్చు. ఇప్పటివరకు శస్త్రచికిత్స వస్తువులు, చైనా నుండి వచ్చే గ్లోబ్స్‌తో సహా డజన్ల కొద్దీ ఉత్పత్తులు ఎక్కువగా భారత్‌లో వినియోగిస్తున్నాం. అయితే చైనా నుండి వస్తువులు ఆగిపోవడంతో స్థానిక కంపెనీలే తమ ఉత్పత్తిని పెంచాయి.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి చైనా అన్ని చర్యలు తీసుకుంటుంటోంది. అయితే ఇది ఒక్కసారిగా తొలగిపోవడం సాధ్యం కాదని, దీనికి చాలా సమయం పడుతుందని ఉత్తరప్రదేశ్ కెమిస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సైనీ అన్నారు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి చైనాకు సమయం పడుతుంది. స్థానిక కంపెనీలు దీనిని అర్థం చేసుకున్నాయి. దీంతో చాలా వస్తువుల ఉత్పత్తిని ప్రారంభించాయి. స్వదేశీ కంపెనీలు తమను తాము నిరూపించుకోవడానికి ఇది మంచి సమయంగా భావిస్తున్నాయి.

చైనా నుండి దిగుమతి చేసుకునే ప్లాస్టిక్ గృహోపకరణాలు, బొమ్మలు నిలిచిపోయాయి. హోలీ దగ్గరలో ఉందని, చైనా నుంచి సరుకులు మధ్యలో చిక్కుకున్నాయని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు. మార్కెట్ డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఏర్పడకుండా ఇప్పుడు దేశీయ కంపెనీల ఉత్పత్తులు పెంచాల్సి ఉంటుంది. అన్ని స్వదేశీ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. దిగుమతిదారులందరూ ఉత్పత్తుల కోసం ఆర్డర్లు తగ్గించారు. చైనా నుండి డజన్ల కొద్దీ రసాయన దిగుమతులు ఉన్నాయని రసాయన వ్యాపారవేత్త రాజేంద్ర అగర్వాల్ వివరించారు. చైనా నుండి దిగుమతులు నిలిచిపోవడంతో మరో ముప్పు కూడా ఉంది. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని దేశీయ కంపెనీలు వస్తువుల ధరలను పెంచే అవకాశం కూడా ఉంది. అయితే చైనా కంపెనీలు తిరిగి ప్రారంభమైన తర్వాత దిగుమతులను నియంత్రించడం ప్రభుత్వ మీదే ఆధారపడి ఉంటుంది.

ఇతర దేశాలపై ప్రభావం

కరోనా వైసర్ చైనాలో విస్తరిస్తుండడంతో ప్రపంచ దేశాల్లోనూ గుబులు మొదలైంది. చైనాతో ఆర్థిక సంబంధాలను కల్గివున్న దేశాలపైనా ప్రభావం కనిపిస్తోంది. దీనికి కారణం చైనా నుంచి దిగుమతులు నిరాకరించడం, అదే సమయంలో ఎగుమతులపైనా ప్రభావం చూపడం. గత శుక్రవారం(జనవరి ఆఖరున) కరోనా ప్రభావంతో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. శుక్రవారం ఆసియా దేశాల్లో ఆందోళనల ప్రభావం భారత్ స్టాక్‌మార్కెట్లపైనా కనిపించింది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో మృతుల సంఖ్య పెరగడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలను పలు దేశాలు గమనిస్తున్నాయి.

బడ్జెట్ కారణంగా కూడా సూచీలు భారీగా పతనమయ్యాయి. అయితే మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లలో భారీ రికవరీ మొదలైంది. అయితే అమెరికా మార్కెట్లు లాభపడితే ఇతర వర్ధమాన దేశాల్లోనూ సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. అమెరికా దిగుమతులపై సుంకాల్లో కోత, ద్రవ్యలభ్యతను పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రతిఒక్కరూ సెంటిమెంట్ బలపడిందని, మార్కెట్లు మరింత పెరుగుతాయని భావించారు. అయితే ఒక్కసారిగా కరోనా వైరస్ ముప్పు పెరుగుతోందనే ఆందోళనలు ఎక్కువయ్యాయి.

India suspends import of goods from China by coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News