Monday, April 29, 2024

ఎథిక్స్ కమిటీపై మహువా మొయిత్రా మండిపాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా సీరియస్ అయ్యారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీ పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడిగిందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువా మొయిత్రా గురువారం ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ మధ్యలోనే ఆమె మీటింగ్‌నుంచి వెళ్లిపోయారు. ఆమెతో పాటుగా ఎథిక్స్ కమిటీలోని విపక్ష ఎంపీలు కూడా వాకౌట్ చేశారు.

ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ మహువా మొయిత్రాను వ్యక్తిగతమైన, అనైతికమైన ప్రశ్నలు వేశారని కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ ఎంపి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాకౌట్ అనంతరం చెప్పారు. అసలు ఇదేం మీటింగ్, వాళ్లు చాలా మలినమైన ప్రశ్నలు వేశారని మొయిత్రా ఆరోపించారు. .సమావేశంనుంచి బయటికి వస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది పడితే అది అడుగుతున్నారని, అన్నీ పిచ్చి మాటలు మాట్లాడారని, మీ కళ్లలో నీళ్లు చూస్తామని వాళ్లు అన్నారని, నా కళ్లలో మీకు నీళ్లు కనిపిస్తున్నాయా? అని మొయిత్రా విలేఖరులతో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News