Monday, April 29, 2024

పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఎదుట మహువా మొయిత్ర హాజరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రశ్నలకు నగదు ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్ర గురువారం పార్లమెంట్‌కు చెందిన ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. మూడు చేతిసంచులను మోసుకుంటూ మొయిత్ర ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొయిత్రకు అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలంటూ ఎథిక్స్ కమిటీ సమన్లు జారీచేసింది.

ముందుగా కుదుర్చుకున్న కార్యక్రమాల వల్ల తాను అక్టోబర్ 31న హాజరుకాలేనంటూ మొయిత్ర లేఖ రాయడంతో నవంబర్ 2న హాజరుకావాలంటూ ఎథిక్స్ కమిటీ మరోసారి సమన్లు జారీచేసింది.

తనపై ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దెహద్రాయ్‌ను, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరనందానిని క్రాస్ ఎగ్జామైన్ చేయాలని డిమాండు చేస్తూ ఎథిక్స్ కమిటీకి బుధవారం మొయిత్ర లేఖ రాశారు.

వ్యాపారవేత్త హీరనందాని ప్రోద్బలంతో గౌతమ్ అదానీపై లోక్‌సభలో ప్రశ్నలు అడిగిందుకు మొయ్రిత డబ్బులు పుచ్చుకున్నారంటూ బిజెపి ఎంపి నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు. వీటిపైనే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది. అక్టోబర్ 26న దూబే, న్యాయవాది జై అనంత్ దెహద్రాయ్ కమిటీ ఎదుట మొయిత్రకు వ్యతిరేకంగా మౌఖికంగా వాంగ్మూలం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News