Monday, April 29, 2024

భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి ఏమన్నారంటే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూకబ్జా ఆరోపణలపై స్పందించారు. భూకబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని, కోర్టును ఆశ్రయిస్తానని తేల్చి చెప్పారు. గిరిజనుల భూములు ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలాల్లోని కేశవరం గ్రామంలోని 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ (లంబాడీ) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని 9 మంది బినామీ అనుచరులు అక్రమంగా ఆక్రమించుకుని మోసం చేసి కుట్ర పన్నారని శామీర్‌పేట పోలీసు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News