Monday, April 29, 2024

మోడీ మళ్లీ గెలిస్తే నియంతృత్వమే: ఖర్గే

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలకు దక్కే చివరి అవకాశం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సోమవారం భయాందోళనలు వెలిబుచ్చారు. రానున్న ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన పక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వాన్నే ఇష్టపడవచ్చునని ఖార్గే హెచ్చరించారు. బిజెపి, దానిని సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌లకు దూరంగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు. ఆ రెండు సంస్థలు ‘విషం వంటివి’ అని ఖార్గే ఆరోపించారు. భువనేశ్వర్‌లో కాంగ్రెస్ ర్యాలీలో ఖార్గే ప్రసంగిస్తూ, ‘భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాదుకోవడానికి జనానికి ఉండే చివరి అవకాశం ఇదే కావచ్చు. నరేంద్ర మోడీ కనుక మరొక ఎన్నికలలో నెగ్గినట్లయితే దేశంలో వచ్చేది నియంతృత్వమే. రష్యాలో పుతిన్ వలె బిజెపి భారత్‌ను పాలిస్తుంది’ అని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ఖార్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, మోడీ సారథ్యంలోని ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాలను, ప్రతిపక్ష నేతలకు బెదరింపులతో పాలన సాగిస్తోందని చెప్పారు.

‘నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు ఇడి, ఆదాయపు పన్ను శాఖ (ఐటి) సాధనాలుగా మారాయి’ అని ఆయన ఆరోపించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను వ్యతిరేకిస్తున్నందున ఆయనను తరచు బెదరిస్తున్నారని ఖార్గే ఆరోపించారు. ‘అయితే, రాహుల్ వాటి ఒత్తిడికి లోను కావడం లేదు. దేశాన్ని చీల్చే యత్నం చేస్తున్న శక్తులపై పోరాటాన్ని ఆయన కొనసాగిస్తున్నారు అని ఖార్గే చెప్పారు. ఆదివారం కాంగ్రెస్ శిబిరంలో నుంచి వెలుపలికి వచ్చి ఎన్‌డిఎలో తిరిగి చేరిన జెడి (యు) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి ఖార్గే ప్రస్తావిస్తూ, ఎన్నికలలో ఆ మార్పు ప్రభావం ఏమీ ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ‘మహాఘట్‌బంధన్‌ను ఒక వ్యక్తి వీడడం మమ్మల్ని బలహీనపరచదు. మేము బిజెపిని ఓడిస్తాం’ అని కాంగ్రెస్ చీఫ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News