వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పంపిన నిందితుడు
హైదరాబాద్: మహిళ వాట్సాప్ నంబర్‌కు అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…పశ్చిమ బెంగాల్‌కు చెందిన చత్రి శ్యాం నల్గొండ జిల్లా, భువనగిరి, సంతోష్ నగర్‌లో ఉంటూ తుర్కపల్లిలోని చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం బాధితురాలి మొబైల్ నంబర్‌ను ఆమె సోదరి మొబై నుంచి ఆమెకి తెలియకుండా తీసుకున్నాడు. డిసెంబర్,2020లో బాధితురాలికి ఫోన్ చేశాడు. దానికి బాధితురాలు స్పందించలేదు. దీంతో నిందితుడు ఇంటర్‌నెట్ నుంచి కొన్ని అసభ్య చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. వాటిని మార్ఫింగ్ చేసి బాధితురాలి వాట్సాప్‌కు పంపిస్తూ వేధిస్తున్నాడు. అంతేకాకుండా తరచూ అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ లక్ష్మికాంత్ రెడ్డి తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.