Monday, April 29, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని మత్స్యకారుడు మృతి

- Advertisement -
- Advertisement -

చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుందరగిరి గ్రామానికి చెందిన మత్స్యకారుడు మెడబోయిన మల్లేశం (55) ఉదయం చేపల వేటకు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో అదే గ్రామానికి చెందిన పత్తెం సంపత్(45) కనిపించడంతో మల్లేశం బైక్ పై కూర్చొని ఇద్దరూ రోడ్డు పక్కన ముచ్చడించుకుంటున్నారు. అదే సమయంలో హుజురాబాద్ నుండి హుస్నాబాద్ వైపు వెళుతున్న TS 02 UA 5657 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఇద్దరిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న మల్లేశంను సుమారు నలభై అడుగుల వరకు బస్సు బైక్ తో సహా ఈడ్చుకెళ్లింది.ఇది గమనించిన చుట్టూ పక్కల వారు అరవడంతో డ్రైవర్ బస్సు ను ఆపి అక్కడి నుంచి పరార్ అయ్యాడు.

రైతులు, స్థానికులు ప్రమాదం జరిగిన ఇద్దరిని 108లో కరీంనగర్ ఆసుపత్రి కి తరలించారు. మెడబోయిన మల్లేశం వైద్యం అందించేలోపే చనిపోయాడు.పత్త సంపత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన మత్స్యకారుడికి న్యాయం చేయాలని ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి ఆధ్వర్యంలో గ్రామస్తులు సంఘటన స్థలంలో ఆందోళన కు దిగారు.అతివేగంగా, అజాగ్రత్తగా బస్సులో నడిపిన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దర్యాప్తు చేసి డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సామల రాజేశం సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. మత్స్యకారుడైన మల్లేశం కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, తోటి మత్స్య కారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లేశానికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. కుమారుడు ఉపాధి నిమిత్తం రెండు నెలల క్రితమే గల్ఫ్ వెళ్లాడు. కేసు దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News