Monday, May 6, 2024

జూపార్కులో సింహం దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -
Man Rescued From Lion's Claws In Alipore Zoo in Kolkata

కోల్‌కత: ఇక్కడి అలీపూర్ జూ పార్కులోని జంతువుల ఎన్‌క్లోజర్‌లోకి అక్రమంగా చొరబడిన ఒక వ్యక్తిపై సింహం దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జూ పార్కులోకి ప్రవేశించిన ఒక గుర్తు తెలియని వ్యక్తి రెండంచెల కంచెలను దాటి, ప్రహరీ గోడను డూకి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించగా ఆ వ్యక్తిపై బోను వెలుపల ఉన్న ఒక సింహం దాడి చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర సందర్శకులు వెంటనే జూ సిబ్బందిని అప్రమత్తం చేయగా వెంటనే ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని జూ అధికారి ఒకరు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సిసిటివి ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నామని, ఆ వ్యక్తి ఎవరో ఇంకా తెలియరాలేదని అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News