Wednesday, May 1, 2024

విధ్వంసక క్షిపణుల కోసం బిడిఎల్‌తో రక్షణ శాఖ ఒప్పందం

- Advertisement -
- Advertisement -
Defence Ministry signs contract with BDL
4,690 ట్యాంకు విధ్వంసక క్షిపణుల కోసం బిడిఎల్‌తో రక్షణ శాఖ ఒప్పందం

న్యూఢిల్లీ: భారత సైన్యం కోసం 4,960 యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణుల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బిడిఎల్)తో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 1,188 కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందాన్ని బిడిఎల్‌తో కుదుర్చుకున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1,850 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్ధమున్న ఈ క్షిపణులను వాహనంపై నుంచే కాక భూమిపై నుంచి కూడా ప్రయోగించవచ్చు. మూడేళ్లలో ఈ క్షిపణులను బిడిఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ రక్షణ శాఖకు చెందిన ఎంబిడిఎ మిసైల్ సిస్టమ్స్ నుంచి లైసెన్సు పొందిన బిడిఎల్ మిలన్-2టి ట్యాంకు విధ్వంసక క్షిపణులను తయారు చేసి భారత సైన్యానికి సరఫరా చేయనున్నది. ఈ క్షిపణులతో భారత సాయుధ దళాల యుద్ధ సన్నద్ధత మరింత బలపడుతుందని రక్షణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News