Friday, April 26, 2024

వాగు దాటేందుకు ప్రయత్నించి.. వ్యక్తి గల్లంతు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: జిల్లాలోని దారుర్ మండలం దోర్నాల్ వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. దోర్నాల్ గ్రామానికి చెందిన గోరప్ప, కృష్ణలు స్టేషన్ దారుర్ లో రాత్రి జరిగిన పీర్ల పండుగ ఉత్సవాలకు డప్పు కొటేందుకు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం తమ గ్రామానికి వెళ్తుండగా.. వాగు వద్ద కాపలాగా ఉన్న పోలీసులు వాగు ఉదృతంగా ప్రవహిస్తోందని వాగు దాటేందుకు నిరాకరించారు.

వాళ్ళు ఎలాగేనా తమ ఇంకిటి చేరుకోవాలని పంట పొలాల సమీపంలో ఉన్న చెక్ డ్యామ్ వద్ద నుండి వాగు దాటేందుకు ప్రయత్నించి వాగులో కొట్టుకుపోతూ ఉండగా కృష్ణ అనే వ్యక్తిని అక్కడే ఉన్న ఒక వ్యక్తి కాపాడి బయటకు తీసుకు వచ్చాడు గోరప్ప వాగులో కొట్టుకుపోయాడు. అతని ఆచూకీ తెలియరాలేదు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Man washed away in Dornal Vagu in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News