Friday, May 3, 2024

స్టార్ హీరోకు జోడీగా మానస

- Advertisement -
- Advertisement -

Manasa Radhakrishnan

 

టాలీవుడ్‌లో మలయాళీ భామల హవా కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. మోస్ట్ సక్సెస్ ఫుల్, మోస్ట్ టాలెంటెడ్ ముద్దుగుమ్మలంతా మలయాళం నుండి దిగుమతి అయిన వారే.

ఇక ఇప్పుడు మరో మలయాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ని అలరించడానికి రాబోతోందట. ఆమె పేరు మానస రాధాకృష్ణన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘వకీల్ సాబ్‘ సినిమా పూర్తి కాగానే హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుందట.

ఈ లోగా హరీష్ శంకర్ గ్రౌండ్ వర్క్ అంతా సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ పేరును ఫైనల్ చేసేశాడు. బెస్ట్ కాంబినేషన్ అయిన హరీష్, దేవిశ్రీ ప్రసాద్ మరోసారి ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం మలయాళీ భామ మానస రాధాకృష్ణన్‌ని పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఎంచుకునే యోచనలో హరీష్ అండ్ టీమ్ ఉన్నట్లు తెలిసింది. మరోవైపు మానస మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. యాక్టింగ్ టాలెంట్ తో పాటు, గ్లామర్ పాళ్లు కూడా ఈ భామలో కాస్త ఎక్కువే. కాబట్టి టాలీవుడ్‌లో ఈ భామ నిలదొక్కుకునేందుకు ఇంతకన్నా కావల్సిందేముంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News