Tuesday, May 14, 2024

ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Inter evaluation

 

ముందుగా ద్వితీయ సంవత్సరం వాల్యుయేషన్
మొదటి రోజు ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, సివిక్స్ సబ్జెక్టులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 33 కేంద్రాలలో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ముందుగా ద్వితీయ సంవత్సరం, ఆ తర్వాత ప్రథమ సంవత్సరం సమాధాన పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. మంగళవారం ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, సివిక్స్ సబ్జెక్టులకు మూల్యాంకనం చేపట్టారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఐదు స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంపులకు ప్రధాన మార్గాలలో రవాణా సౌకర్యం కల్పించారు. కరోనా నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనం చేసే అధ్యాపకుల మధ్య భౌతిక దూరం ఉండాలనే ఉద్దేశంతో 12 ఉన్న మూల్యాంకన కేంద్రాలకు సమీపంలో ఉన్న 22 అదనపు భవానాలను పెంచి మొత్తం 33 కేంద్రాలలో మూల్యాంకనం చేపట్టారు. మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు 55 లక్షల సమాధాన పత్రాలను 15 వేల మంది అధ్యాపకులు మూల్యాంకనం చేయనున్నారు.

మూల్యాంకన కేంద్రాలలో పరిశుభ్రత పాటించడం, శానిటైజర్లు వినియోగించడం, అధ్యాపకులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ అధ్యాపకులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మూల్యాంకనం కేంద్రాలలో ఉష్ణోగ్రత పరీక్షల కోసం ఇన్ఫ్రా రెడ్ గన్స్ ఉపయోగిస్తున్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులకు రవాణా, వసతి సదుపాయాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాల్లో పరీక్షా సిబ్బంది కోసం ప్రత్యేక ఆర్‌టిసి బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే మూల్యాంకనం విధులకు హాజరయ్యే సిబ్బంది భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో ఉద్యోగికి మూడు మాస్కులు, వ్యక్తిగత శానిటైజర్లు, లిక్విడ్ సోప్‌లు, పోలీసు పాస్‌లు అందజేశారు. మూల్యాంకన కేంద్రాలలో ప్రతి రోజూ శానిటైజేషన్ చేయడంతోపాటు క్యాంప్ కేంద్రాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేశారు.

మొదటి రోజు 4,350 మంది హాజరు

ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం విధులకు మొదటి రోజు మొత్తం 4,370 (76 శాతం) సిబ్బంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 673 మంది విధులకు హాజరయ్యారని అన్నారు. అలాగే కరీనంగర్‌లో 595,ఖహ్మంలో 425, మహబూబ్‌నగర్‌లో 349, నిజామాబాద్‌లో 312, మేడ్చల్‌లో 298, అదిలాబాద్‌లో 291, హైదరాబాద్‌లో 275తో పాటు ఒకేషనల్‌కు 156 మంది అధ్యాపకులు హాజరయ్యారని పేరర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News