Sunday, April 28, 2024

మంచు లక్ష్మి కుమార్తె అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ(6) మంచు ఆనంద్ అరుదైన ఘనతను సాధించింది. విద్యా ‘యంగ్ చెస్ ట్రైనర్’ కావడం ద్వారా తన కుటుంబం గర్వించేలా చేసింది. నోబెల్ బుక్ ఆఫ్ వరల్ రికార్డుల్ల్లో ఆమె చోటు దక్కించుకుంది. నోబెల్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ ప్రతినిధి డాక్టర్ చోకలింగం బాలాజీ సమక్షంలో పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. విద్యా నిర్వాణ ఈ ఘనతను సాధించినందుకు మోహన్ బాబు, మంచు లక్ష్మి సహా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను వారి లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. మంచు వారసురాలు సాధించిన ఘనతకు అభిమానులు సోషల్ మీడియాల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Manchu Lakshmi Daughter enter into World Nobel Book

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News