Home చిన్న సినిమాలు మందులోడా…

మందులోడా…

Manduloda song released by Chiranjeevi

 

సుధీర్ బాబు హీరోగా పావెల్ నవగీతన్ హీరోయిన్‌గా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇటీవల వచ్చిన ఈ చిత్రం టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ మంచి మాస్ మసాలా ఫోక్ నెంబర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ‘మందులోడా…’ అంటూ సాగే ఈ పక్కా ఫోక్ సాంగ్‌కు మణిశర్మ సూపర్‌గా ట్యూన్ కట్టగా దానికి సుధీర్ బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మాస్ యువతను ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో నరేష్, రఘుబాబు, సత్యం రాజేష్, హర్షవర్ధన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.