Monday, May 6, 2024

మణిపూర్ వీడియోలు: ప్రధాన నిందితులలో ఒకరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై మూకలు అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించి మే 4వ తేదీ నాటి వీడియోలో కనిపించిన ప్రధాన నిందితులలో ఒకరిని మణిపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆ అమానవీయ సంఘటనకు సంబంధించిన వీడియోలు బుధవారం బయట పడిన వెంటనే నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఒక వ్యక్తిని తైబల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. 26 సెకండ్ల నిడివిగల ఆ వీడియోలో ఈ వ్యక్తి ప్రధానంగా కనిపించాడు.

ఈ ఘటనకు పాల్పడిన గుర్తు తెలియని దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులను తౌబల్ జిల్లాలోని సెక్మయ్ పోలీసు స్టేషన్‌లో నమోదు చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు. నిందితులను సాధ్యమైనంత త్వరితంగా అరెస్టు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.

ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇంఫాల్ లోయలో స్థిరపడిన మీటీ తెగలకు, పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన కుకీ తెగల వారికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘర్షణలలో ఇప్పటివరకు 160 మందికిపైగా మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News