Monday, May 6, 2024

నాలుగు నెలల పాలనలో నానా తిప్పలు : హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్: కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి, ఓటేసి ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మడమ తిప్పారని విమర్శించారు. రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశారా? అని నిలదీశారు. మెదక్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘రుణ మాఫీ డబ్బులు రాలేదని… బ్యాంకు అధికారులు రైతుల ఇళ్లపై పడ్డారు. రూ. 2 లక్షల రుణ మాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్ కు ఓటేయండి, రుణ మాఫీ కాకపోతే బిఆర్ఎస్ కు ఓటేయండి. వరి పండిస్తే రూ. 500 బోనస్ ఇస్తామన్నారు, ఇచ్చారా? వడ్లపై దృష్టిపెట్టమంటే.. రేవంత్ రెడ్డి వలసలపై దృష్టి పెట్టారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. కానీ చేయలేదు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో నానా తిప్పలు పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి’ అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News