Tuesday, April 30, 2024

కిలాడీ లేడీ వలలో పెళ్లి కొడుకులు..

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: పెళ్లి పేరుతో పలువురు యువకులను పెళ్లి చేసుకొని, కొద్ది నెలలు కాపురం చేసినట్లు నటించి, లక్షలాది రూపాయల నగదు, బంగారంలో యువతి పరారవుతున్న సంఘటన ఎన్టీపీసీ రామగుండంలో వెలుగు చూసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన పెంట అనూష మ్యాట్రిమోన్లో యువకులకు పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతుందని బాధితుడు సుద్దాల వేణు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు పెంట అనూష గత సంవత్సరం మాట్రిమోన్లో పరిచయం అయిందని, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో అప్పుడే తనకు డబ్బులు అవసరం ఉందని తెలపడంతో రెండు లక్షల రూపాయలు ఆన్‌లైన్ ద్వారా పంపించాలని తెలిపిందని వేణు ఫిర్యాదులో తెలిపాడు.

గత సంవత్సరం డిసెంబర్ 14న పెళ్లి జరిగిందని. పెళ్లి సందర్భంగా 70వేల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం ఇచ్చామని అన్నాడు. రెండు నెలలు తనతో పాటు ఉండి చెప్పకుండానే వెళ్లిపోయిందని తనతో మళ్లీ కాపురానికి రావాలని ఫోన్ ద్వారా సంప్రదించగా హైదరాబాద్‌లో ఉన్న అక్కడికి రావాలని తెలిపిందని వేణు పేర్కొన్నాడు. తన మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లగా గదిలో వేసి బంధించి తీవ్రంగా కొట్టి సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిందని తెలిపాడు. మళ్లీ 20 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే నేను నిన్ను కొట్టిన వీడియోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుందన్నాడు. పెంట అనూష పెళ్లిళ్ల పేరుతో యువకులను మోసం చేస్తుందని ఇప్పటికే తనకంటే ముందు ముగ్గురిని పెళ్లి చేసుకొని మోసం చేసిందని అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ ఇంటి వద్ద వదిలి వెళ్లిన బ్యాగులో ఉన్నాయని అన్నారు.

మరికొంత మంది వద్ద పెళ్లి చేసుకుంటానంటూ డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు బాధితులు కూడా తనకు చెప్పారని అన్నారు. ఈ విషయంలో పోలీసులకు యువతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు యువతి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News