Sunday, May 5, 2024

ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వేధింపులు…

- Advertisement -
- Advertisement -

Attempts-Suicide

హైదరాబాద్: అత్తంటి వేధింపులకు ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషాదఘటన నగరంలోని హయత్ నగర్ ఎల్లారెడ్డికాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే కనకదుర్గకు ఆడపిల్ల పుట్టిందేనే కారణంతో భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురిచేయడంతో తట్టుకుకోలేక కనకదుర్గ విషయం తాగి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందిని వైద్యులు చెబుతున్నారు. తన చావుకు కారణం అత్తింటివారేనని కనకదుర్గ సూసైడ్ నోట్ కూడా రాసింది. ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో పాటు, అదనపు కట్నం కోసం కనకదుర్గపై కొంతకాలంగా భర్తతో పాటు అత్తమామలు దాడి చేసేవారని బాధితురాలి కుటుంబీకులు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Married Woman Attempts Suicide At Hayathnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News