Saturday, May 4, 2024

బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పుర్బా మేదినిపూర్ జిల్లా ఎగ్రాలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం పేలుడు సంభవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నివాస ప్రాంతాల్లో ఈ కర్మాగారం ఉందని, అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీస్ అధికారులు తెలిపారు. రాష్ట్ర పర్యావరణ మంత్రి మానస్ రంజన్ భూనియా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఇలాంటి అక్రమ తయారీ యూనిట్ల గురించి ప్రజలు వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ బాణాసంచారం కర్మాగారం యజమానిని ఇటీవలే అరెస్టు చేశామని, కానీ బెయిల్‌పై బయటకు వచ్చాడని ముఖ్యమంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News