Monday, May 6, 2024

ఐ-పాస్‌తో ఖుష్

- Advertisement -
- Advertisement -

TS ipass

 

భారీగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధులు

గత డిసెంబర్ 31 నాటికి వచ్చిన పెట్టుబడులు రూ. 1.84లక్షల కోట్లు
11,857 పరిశ్రమలు, 13లక్షల మందికి ఉపాధి అవకాశాలు : సామాజిక ఆర్థిక సర్వే

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం, స్వీయ ధ్రువీకరణ పత్రం చట్టం (టిఎస్ ఐపాఎస్) 2014ను అమలు చేస్తున్నప్పటి నుంచి తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు తీస్తోందని సామాజిక ఆర్ధిక సర్వే..2020 స్పష్టం చేసిం ది. ఈ రంగంలో ఆరేళ్ళలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నది. టిఎస్..ఐపాస్ కారణంగా రాష్ట్రానికి పెద్దఎత్తన పెట్టుబడులతో పాటు నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయి. గత డిసెంబర్ నెల 31వ తేదీ నాటికి రాష్ట్రానికి 22 కేటగిరిలలో మొత్తం 11,857 పరిశ్రమలు వచ్చాయి. ఈ కంపెనీల వల్ల రాష్ట్రంలో రూ. 1,84,655.44 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కాగా 13,08,056 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

అయితే వచ్చిన11,857 పరిశ్రమలలో 9,020 కంపెనీలు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించాయి. సదరు కంపెనీల పెట్టుబడుల విలువ రూ. 85,125.83 కోట్లు కాగా, 6,23,071 మందికి ఉపాధి లభించింది. ఇక అడ్వాన్సుడు స్టేజిలో 764 కంపెనీలు ఉండగా, వాటి విలువ రూ. 28,116.96 కోట్లు. ఈ స్టేజిలో 2,87,112 మందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కాయి. అలాగే ప్రారంభ (ఇన్షియల్) స్థాయిలో 645 కంపెనీలు ఉన్నాయి. వాటి విలువ రూ 51,023.80 కోట్లు కాగా, 2,57,323 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇంకా ప్రారంభించాల్సిన 1,428 పరిశ్రమలు ఉండగా, ఆయా కంపెనీల యజమాన్యాలు రూ.20,388.85 కోట్ల పెట్టుబడిగా పెడుతున్నారు. ఈ కంపెనీలు ప్రారంభం అవుతే ఆయా ప్రాంతాల్లో మరో 1,40,550 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సామాజిక ఆర్ధిక సర్వేపేర్కొన్నది.

Massive investments with TS ipass
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News