Sunday, April 28, 2024

భారత సంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

Maxwell engagement

 

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గత కొంత కాలంగా భారతీయ సంతతికి చెందిన విన్సీ రామన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ త్వరలో నిశ్చితార్థం చేసుకుంటామని ప్రకటించారు కూడా. కాగా శనివారం మెల్‌బోర్న్‌లోని తూరక్ అనే ప్రాంతంలో భారతీయ సంప్రదాయంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విన్సీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకొంది. ‘గత రాత్రి మేము భారతీయ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థం చేసుకున్నాం. మన వివాహ వేడుక ఎలా ఉంటుందో మ్యాక్స్‌వెల్‌కు చిన్న టీజర్ ద్వారా చూపించాను’ అని విన్సీ ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు ఆ జంటకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

 

Maxwell engagement in the Indian tradition
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News