Saturday, April 27, 2024

నితిన్ పెళ్లి వాయిదా?

- Advertisement -
- Advertisement -

Nithin Marriage

 

యంగ్ హీరో నితిన్ తాను ప్రేమించిన షాలినితో పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ఇప్పుడు అతనికి విలన్‌గా మారింది. డెస్టినేషన్ మ్యారేజ్‌లో భాగంగా తన పెళ్లిని దుబాయ్‌లో గ్రాండ్‌గా జరపాలని నిర్ణయించారు. రెండు కుటుంబాల వారు అందుకు తగ్గ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఏప్రిల్ 15న ప్రీ వెడ్డింగ్, ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో విదేశీయులను పలు దేశాలు అనుమతించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లడం అంత క్షేమకరం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో నితిన్ పెళ్లి వాయిదా తప్పదంటున్నారు. ఒకవేళ దుబాయ్‌లో పెళ్లి కుదరకపోతే హైదరాబాద్ శివారులో నితిన్ వివాహం చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 31 తర్వాత మ్యారేజ్ హాళ్ల బుకింగ్స్ రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చివరికి పెళ్ల్లే వాయిదా పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

Nithin Marriage postponed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News