Friday, May 3, 2024

మయాంక్ విధ్వంసం..45 బంతుల్లోనే శతకం

- Advertisement -
- Advertisement -

Mayank Agarwal hits 106 in 50 balls against RR

షార్జా: ఐపిఎల్‌ 13వ సీజన్ లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కు ఓపెనర్లు మయాంక్, కెఎల్ రాహుల్ లు ఆది నుంచి రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు రాకెట్ లా దూసుకుపోయింది. ముఖ్యంగా మయాంక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 7 సిక్సులు, 10 ఫోర్లతో మెరుపు సెంచరీ చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే పంజాబ్ బౌలర్లను ఊచకోతకోశాడని చెప్పాలి. మరో ఓపెనర్ రాహుల్(69) కూడా మరోసారి అర్థ శతకంతో రాణించాడు. దీంతో పంజాబ్ భారీ స్కోర దిశగా దూసుకుపోతుంది.

Mayank Agarwal hits 106 in 50 balls against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News