Wednesday, May 1, 2024

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలి: మాయావతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాన్షీరామ్ పోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. ఎస్‌షి, ఎస్‌టిల కోసం డా. బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చినా ఇప్పటికీ ఆ వర్గాలకు అభివృద్ధి చేరలేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల కోసం మరిన్ని చట్టాలు తేవాలని న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ భావించారని ఆయన మాటలను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పట్టించుకోలదేని అన్నారు.

బిఎస్‌పి ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ భరోసా సభకు మాయావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోతిబాపూలే, అంబేద్కర్, నారాయణ గురు చూపిన బాటలో పయనిద్దామని పిలుపునిచ్చా రు. బిఎస్‌పి కేవలం ఎస్‌సిల కోసం కాదని సబ్బండ వర్గాలఅ సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌షి, ఎస్‌టి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపామని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని సూచించారు. బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బిసి ప్రధాని అని చెప్పుకుంటున్న మోడి బిసిలకు ఏం చేశాడని ప్రశ్నించారు. తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామినిచ్చారు. సరూర్‌నగర్ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి బిఎస్‌ఫి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు ఒమిని ఆసుపత్రి నుంచి సరూర్‌నగర్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Also Read: 15 మంది సర్పంచులకు మావోయిస్టుల హెచ్చరిక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News