Monday, April 29, 2024

అంధత్వ నివారణలో వైద్య సిబ్బంది చురుగ్గా పాల్గొనాలి

- Advertisement -
- Advertisement -

సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.రాజలింగం

మనతెలంగాణ/హైదరాబాద్ : అంధత్వ నివారణలో వైద్య సిబ్బంది చురుగ్గా పాల్గొనాలని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.రాజలింగం పిలుపునిచ్చారు. అంధత్వ నివారణ కోసం 15 రోజులుగా నిర్వహిస్తున్న 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం శుక్రవారంతో ముగిసింది. ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వి.రాజలింగం ప్రజలు అనవసరమైన అపోహలు తొలగించుకుని నేత్రదానానికి ముందుకు రావాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది మరింత చురుగ్గా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేసే వారు మిగిలిన దానాలు కూడా చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నేత్రదానంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కార్నియా విభాగాధిపతి డాక్టర్ కేశవరావు, ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మోదినీ, ఆర్‌ఎంఓ నజాఫీ సుల్తానా, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ దీపక్ రెడ్డి, కార్నియా విభాగం వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ మాలతీ క్రిస్టీనా తదితరులు పాల్గొన్నారు.

సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను చేపట్టారు. నల్లగుడ్డు మార్పిడితో అనేక మందికి చూపు తేగలిగిన అవకాశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది అంధులు ఉండగా, భారతదేశంలో 13 మిలియన్ల మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఏడాదికి ఒక లక్ష మందికి కార్నియా మార్పిడి అవసరముందని అంచనా ఉండగా ఏడాదికి 25 వేల నుంచి 30 వేల వరకు మాత్రమే దాతల నుంచి లభిస్తున్నాయి. ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలే నేత్రదాన కార్యక్రమానికి ప్రధాన ఆటంకంగా మారింది.

Sarojini 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News