Tuesday, May 21, 2024

మైక్రోసాఫ్ట్ శాశ్వత ‘వర్క్ ఫ్రమ్ హోం’!

- Advertisement -
- Advertisement -

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇచ్చాయి. మళ్లీ వీరిని ఆఫీస్ నుంచి పనిచేయమని కంపెనీలు చెప్పేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మై ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని శాశ్వతం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఉద్యోగులు కావాలనుకుంటే ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వెర్జ్ నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య సంరక్షణ దృష్టా ఇప్పటికే చాలా మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుంచే డ్యూటీ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి వరకు అమెరికాలో తన కార్యాలయాలను కంపెనీ తెరిచే అవకాశం లేదు. అయితే శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం చేయాలనుకునే ఉద్యోగులు వారివారి మేనేజర్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కంపెనీ సూచించింది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులను కూడా స్వదేశాలకు వెళ్లొచ్చని, అలాగే యుఎస్‌లో ఉండే వారు తమతమ స్వంత ప్రదేశాలకు వెళ్లొచ్చని కంపెనీ వెల్లడించింది. వేతనాల విషయంలో మార్పులు ఉంటాయని సంస్థ తెలిపింది.

Microsoft to Plan for Permanent Work From Home

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News