Friday, May 17, 2024

ఫ్రెంచ్ ఓపెన్‌లో టీనేజ్ సంచలనం

- Advertisement -
- Advertisement -

ఫ్రెంచ్ ఓపెన్‌లో టీనేజ్ సంచలనం
మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న స్విటెక్

Iga swiatek makes French Open 2020 History

పారిస్: పోలండ్‌కు చెందిన టీనేజ్ సంచలనం ఇగా స్విటెక్ తన తొలి గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగి ల్స్ ఫైనల్లో ఈ 19 ఏళ్ల క్రీడాకారిణి నాలుగో సీడ్ సోఫియా కెనిన్‌ను 6-4, 6-1 స్కోరుతో వరస సెట్లలో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 1992లో మోనికా సెలెస్ తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురా లు స్విటెక్ కావడం గమనార్హం. అంతేకాదు పోలెండ్ తరఫున ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అయిన కెనినే ఈ టైటిల్‌ను కూడా గెలుచుకుంటుందని అందరూ భావించారు. అయితే స్విటెక్ ప్రారంభంలోనే కెనిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. అయితే కెనిన్ ఆ తర్వాత స్విటెక్ సర్వీస్ బ్రేక్ చేసి స్కోరును సమం చేసింది. అయితే మరోసారి కెనిన్ సర్వీస్ బ్రెక్ చేసిన స్విటెక్ ప్రత్యర్థికి మరో అవకాశమివ్వకుండా సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో స్విటెక్ మరింత రెచ్చిపోయింది. తిరుగులేని షాట్లతో కెనిన్‌ను గుక్కతిప్పుకోనివ్వలేదు. దీంతో ఆ సెట్‌ను 6-1 స్కోరుతో సునాయాసంగా గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. రోలాండ్ గారిస్ చరిత్రలో ఒక అన్‌సీడెడ్ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది తొమ్మిదో సారి. ఈ విజయంతో స్విటెక్ ఒక్కసారిగా ర్యాకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకుంది.

Iga swiatek makes French Open 2020 History

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News