Saturday, May 4, 2024

ఇలాంటి సినిమానే చేయాలనుకున్నా..

- Advertisement -
- Advertisement -

Vijay devarakonda says about Fighter movie

 

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూరీ,- విజయ్ ఇద్దరికీ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ వర్కవుట్స్ చేయడంతో పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాడని తెలిసింది. తాజాగా విజయ్ ‘ఫైటర్’ సినిమా, పూరీ జగన్నాథ్‌ల గురించి చెప్పుకొచ్చాడు. “నేను ఈ సినిమా కోసం గత 8 నెలలు వర్కవుట్స్ చేశాను. అయితే ఈ మధ్య వర్కవుట్స్ ఆపేశాను. మళ్లీ ఇప్పుడు నాన్-స్టాప్ వర్కవుట్స్ కొనసాగించాల్సి వచ్చింది. నేను ఈ మూవీలో ఒక ఫైటర్ పాత్రను పోషిస్తున్నాను. అది 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ అయినా నేను ఒకరిని మట్టికరిపించగల పోరాట యోధుడిలా కనిపించాలి” అని విజయ్ దేవరకొండ అన్నాడు. “ఇది మనం చూస్తూ వస్తున్న రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు.

నా తరహాలో ఉండే కమర్షియల్ సినిమా అవుతుంది. నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే.. కమర్షియల్ జోనర్‌లో ఇలాంటి సినిమానే చేయాలనుకున్నాను. అయితే కమర్షియల్ సెన్సిబిలిటీలకు పేరుగాంచిన డైరెక్టర్ వల్ల ఈ చిత్రానికి మరింత కమర్షియల్ బ్యాకింగ్ లభించింది” అని విజయ్ తెలిపాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ.. “ఆయన నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలలో ‘పోకిరి’ చాలా ఇష్టం” అని విజయ్ దేవరకొండ అన్నాడు. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News