Monday, May 6, 2024

కరోనాకష్టకాలంలో బిజెపి పారిపోయింది

- Advertisement -
- Advertisement -

Minister Harish GHMC Election Campaign in Tellapur

హైదరాబాద్: దేశంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపిన గొప్పతనం టిఆర్‌ఎస్ దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సోమవారం తెల్లాపూర్‌లోని భారతీనగర్, సాయిబాబా నగర్‌లో హరీశ్‌రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవిస్తే విద్యుత్ కరువై చీకట్లు అలుముకుంటాయని కాంగ్రెస్ నాయకులు అసత్యప్రచారం చేశారని చెప్పారు. అయితే తెలంగాణ సాధించి 24 గంటల విద్యుత్ సరఫరాచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. కృష్ణా,గోదావరి, మంజీర నదులతో హైదరాబాద్‌కు నీళ్లు ఇచ్చేనగరం ఏదైనా ఉందా అంటే అదికేవలం హైదరాబాద్ నగరమేనని ఆయన చెప్పారు. విద్యుత్ వినియోగంలో నంబర్‌వన్, సోలార్ విద్యుత్ ఉత్పాదనలో నంబర్‌వన్‌గా తెలంగాణ ఉందన్నారు. ప్రతిఇంటికి తాగునీరు ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మినహా ఏరాష్ట్రంలేదని ఆయన చెప్పారు.

బిజెపి వాళ్లు ఇప్పుడు శానిటైజర్లు పంచుతున్నారు కరోనా వచ్చినప్పుడు బిజెపి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. పఠాన్‌చెరులో కరోనా వస్తే పదిసార్లు నేను వచ్చి ప్రజలకు వైద్యసేవలు, మందులు ఇప్పించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. మూడునెలలక్రితం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ కరోనా కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చెప్పిన విషయం రాష్ట్రంలోని బిజెపి నాయకులు వినలేదాని ప్రశ్నించారు. అభివృద్ధి,సంక్షేమంకోసం గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కారుగుర్తును గెలిపించాలని హరీశ్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో విచిత్రం ఏమిటంటే కరోనా తెలంగాణరాష్ట్రం నియంత్రించిందని ఆరోగ్యశాఖమంత్రి ప్రశంసిస్తే మరో మంత్రి ప్రకాష్ జవదేవకర్ కరోనాను అరికట్టలేదంటారు. కేంద్ర మంత్రులు ఏకాభిప్రాయంలేకుండా మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి సిద్ధాంతాలను పక్కపెట్టి జూటామాటాలు, సీసాలు, పైసలు పంపిణీ చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News