Monday, April 29, 2024

టాస్క్ మాస్టర్‌కు ప్రమోషన్

- Advertisement -
- Advertisement -
Minister Harish Rao Gets TS Health Ministry
మంత్రి హరీశ్‌రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావు ఇక నుంచి రెండు శాఖల బాధ్యతలు నిర్వహించనున్నట్లు ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కొవిడ్ నివారణ చర్యలపై మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు సిఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, పలు సూచనలు చేశారు. తాజాగా ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ బాధ్యతలను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించింది.ట్రబుల్ షూటర్‌గా టిఆర్‌ఎస్ పార్టీలో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్న ఆర్ధిక మంత్రి హరీష్‌రావుకు కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖతోపాటు కరోనా కష్టకాలంలో తనకు అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడిగా పేరు తెచ్చుకున్న హరీష్‌రావుకు సిఎం కెసిఆర్ వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు.

హరీష్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం, మల్లన్న సాగర్‌తో పాటు మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి హరీష్‌రావు ఏ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకంతో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి బర్తరఫ్ చేసిన అనంతరం ఆ శాఖను ముఖ్యమంత్రి కెసిఆరే స్వయంగా పర్యవేక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ శాఖకు పూర్తి స్థాయి మంత్రి ఉండాలనే ఉద్దేశంతో హరీష్‌రావుకు ఆ శాఖను అప్పగించారని సిఎంఒ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News