Sunday, April 28, 2024

సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Chit Chat With Media at Telangana Bhavan

హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ”దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు దిమ్మతిరిగే తీర్పు వస్తుంది. దుబ్బాకలో టిఆర్ఎస్ గతంలో కన్నా ఎక్కవ మెజార్టీ సాధిస్తుంది. కాంగ్రెస్, బిజెపిలు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేదు.. దుబ్బాకలో వారికి మిగిలేది గుండు సున్నా. బిజెపి తీరు సమాజంలో తక్కువ, సామాజిక మాధ్యమంలో ఎక్కువ అన్నట్టు ఉంది. బిజెపి వాట్సాప్ యునివర్సిటీ నడుపుతూ తప్పుడు సందేశాలు పంపుతున్నారు. బిజెపి నేతలు సిఎం కెసిఆర్ పై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. మేం మాట్లాడక పోవడం మా చేత కాని తనం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రధాని, కేంద్రమంత్రుల మీద అంతకంటే ఎక్కువ స్థాయిలో మాట్లాడగలం” అని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి తన పార్టీలోని నేతలకు హుందాతనం నేర్పాలన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాలు తెలంగాణ కన్నా బాగున్నాయా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ వరదల గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు బెంగళూరు వరదల గురించి మాట్లాడడం లేదు ఎందుకు..? కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసింది. కరోనాకు ముందు నుంచే దేశంలో ఆర్థిక మందగమనం ఉంది. 24 నెలలుగా ఆర్థిక పరిస్థితి కేంద్రంలో బాగాలేదు.. కరోనా కారణం కాదని కుండబద్దలు కొట్టారు. దుబ్బాకకు బిజెపి, కేంద్రం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలి మంత్రి డిమాండ్ చేశారు. నలుగురు బిజెపి ఎంపిలు రాష్ట్రానికి ఒక్కపైసా నిధులైనా అదనంగా తెచ్చారా..?. హరీశ్ రావు కేంద్రం నిధుల వాటా గురించి చర్చకు రమ్మంటే బిజెపి నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. సిఎం దుబ్బాకలో ప్రచారం చేసే విషయంపై ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. హుజూర్ నగర్ లో సిఎం ప్రచారం చేయకున్నా భారీ మెజార్టీ సాధించామని గుర్తుచేశారు. రేపు రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోందని చెప్పారు. పంట నష్టానికి సంబంధించి సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారు. పార్టీలోకి మంచి వారు వస్తే తీసుకుంటాం. త్వరలోనే టిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

Minister KTR Chit Chat With Media at Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News