Sunday, April 28, 2024

ప్రధానికి రాసిన ఉత్తరాలకు దిక్కులేదు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Fires on Congress and BJP Leaders

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ వరదసాయం కోసం ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు దిక్కులేదని కెటిఆర్ దుయ్యబట్టారు. వరదలతో రాష్ట్రంలో రూ.8 వేల868 కోట్ల నష్టం వాటిల్లిందని తక్షణ సహాయం కింద రూ.1355 కోట్లు, హైదరాబాద్‌లో వరద నష్టాన్ని నివారించేందుకు 465 కోట్ల సహాయం కోరుతూ సిఎం కెసిఆర్ అక్టోబ్ 15న ఉత్తరం రాస్తే ఇప్పటివరకు దిక్కులేదని కెటిఆర్ చెప్పారు. అదే కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాయగానే రూ.669కోట్ల 85 లక్షలు, గుజరాత్ సిఎం ఉత్తరం రాస్తే రూ.500 కోట్లు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే పైసా ఇవ్వలేదన్నారు. ప్రధానిమోడీ తెలంగాణకు ప్రధాని కాదాని కెటిఆర్ ప్రశ్నించారు. ఆరుసంవత్సరాల్లో పన్నుల రూపాన కేంద్రానికి రూ, 2లక్షల78 కోట్లు తెలంగాణ ఇస్తే చట్టపరంగా రావల్సిన గ్రాంట్లు కేవలం రూ.లక్షా40వేల కోట్లు ఇచ్చారే కానీ అదనంగా ఒక్కపైసా కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రం నుంచి ఒక్కపైసా కూడా తీసుకురాని బిజెపినాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News