Saturday, May 4, 2024

బ్లాక్ మనీకి చెక్‌పెట్టేశాం

- Advertisement -
- Advertisement -

Modi defends decision to cancel large Denomination notes

 

పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని

న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఆటకట్టు అయిందని, పారదర్శకతకు వీలేర్పడిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2016 నవంబర్ 8వ తేదీనే దేశంలో అత్యంత అసాధారణ రీతిలో పెద్ద నోట్ల రద్దుకు మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ మరోమారు సమర్థించుకున్నారు. నల్ల ధనం వాటా తగ్గిందని, పన్నుల చెల్లింపుల వాతావరణం ఇనుమడించిందని , ఆర్థికరంగంలో పారదర్శకతకు తావు ఏర్పడిందని ప్రధాని కితాబు ఇచ్చుకున్నారు. తాము అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న ఈ నిర్ణయంతో సత్ఫలితాలు వెలువడ్డాయని తెలిపారు. పన్నుల చట్టబద్ధత ఏర్పడిందని కూడా తెలిపారు. ఈ చర్యతో జాతీయ ప్రగతి దిశలో ఇతోధికంగా ముందుకు సాగామని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత చోటుచేసుకున్న పన్నులు, జిడిపి నిష్పత్తి, పన్నుల సరళి వంటి వాటిలో చోటుచేసుకున్న పరిణామాలను తెలిపే రేఖాచిత్రాలను కూడా ప్రధాని తమ ట్వీట్‌తో పాటు పొందుపర్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News