Monday, April 29, 2024

ఈషా ఫౌండేషన్ కృషిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -
క్రీడా రంగంలో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
ఈశా గ్రామోత్సవ్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్ : ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్, త్రో బాల్ క్రీడలను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషిని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. సుమారు 17,600 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని ఆయన చెప్పారు. ఈ షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే ఈశా గ్రామోత్సవం వాల్ పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు అధ్వర్యంలో ప్రారంభించిన ’ఈషా గ్రామోత్సవం’ కార్యక్రమంలో భాగంగా దక్షణ భారతదేశం లోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మహబూబ్ నగర్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 23 వరకు వాలీబాల్ (బాలురు) త్రో బాల్ (మహిళల ) క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు గ్రామీణ క్రీడాకారులలో క్రీడా నైపుణ్యాన్ని, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంకోసం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 600 గ్రామాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహించేందుకు సిఎం కప్ క్రీడా పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాకారుల కోచులను ప్రోత్సహించేందుకు అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. దేశానికి సరిపడే క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక స్పృహ, సాంప్రదాయాలు, ఆరోగ్యకరమైన పోటీని పెంచడమే లక్ష్యంగా ఈషా గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి వెల్లడించారు.

ఇందులో భాగంగా గ్రామీణ ఆటలు కలలు నృత్యం నాటకం సంగీతం వంటి విలక్షణమైన స్థానిక గ్రామీణ భారతదేశ సంస్కృతులను ప్రదర్శించాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతి యువకులలో వాలీబాల్ త్రో బాల్ ఆటలను క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడల అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిర్వహిస్తున్న గ్రామోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈశా ఫౌండేషన్ వాలంటీర్లు శైలజ, స్వామి దక్ష్యారి, రాఘవ, టాస్క్ ప్రతినిధులు శ్రీకాంత్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News