Saturday, April 27, 2024

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

Missile attack on Ukraine railway station

50 మంది మృతి, 400మందికి పైగా గాయాలు
ఇది హద్దులు లేని దారుణం: జెలెన్‌స్కీ
అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఖండన

కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్‌పై రష్యా దళాలు శుక్రవారం ఉదయం రాకెట్లతో దాడి చేశాయి. ఈ దాడిలో కనీసం 50 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా,400 మందికి పైగా గాయాల పాలయ్యారు. రష్యా దాడుల సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున సమయంలో ఈ దాడులు చేశారని రైల్వే అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి అర్తోమ్ దెహత్యారెంకో తెలిపారు. రెండు రాకెట్లు ఒకేసారి రైల్వే స్టేషన్‌పై దాడి చేశాయని, గాయపడిన వారిని బస్సులద్వారా , ఇతర మార్గాల ద్వారా ఆస్పత్రులకు తరలిసున్నామని వారు తెలిపారు. దాడి జరిగిన సమయంలలో రైల్వే స్టేషన్‌లో నాలుగు వేలమందికి పైగా పౌరులు ఉన్నట్లు స్థానిక మేయర్ ఒలెక్సాండర్ హంచరెంకో తెలిపారు. వారిలో వృద్ధులు, మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.

ఇది హద్దులు లేని దుర్మార్గం: జెలెన్‌స్కీ

క్రామాటోర్స్ రైల్వే స్టేషన్‌పై రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. యుద్ధ క్షేత్వంలో తకు ఎదురుగా నిలబడే ధైర్యం, బలం లేక విరక్తితో ఉక్రెయిన్ పౌర జనాభాను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘ ఇది హద్దులు లేని దుర్మార్గం.. శిక్షించకపోతే ఎప్పటికీ ఆగదు’ అని అన్నారు. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఈ దాడిని ఖండించాయి.

అవి ఉక్రెయిన్ మిలిటరీ ఉపయోగించే క్షిపణులే: రష్యా

కాగా క్రామాటోర్స్‌లోని రైల్వే స్టేషన్‌పై శుక్రవారం జరిగిన దాడులకు రష్యా బలగాలు కారణమన్న ఆరోపణలను రష్యా రక్షణ శాఖ ఖండించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. దాడికి ఉపయోగించిన క్షిపణులు కేవలం ఉక్రెయిన్ మిలిటరీ మాత్రమే ఉపయోగించే రకానికి చెందినవని పేర్కొంది. మార్చి 14న డొనెట్స్ నగరంలో 17 మంది మృతికి కారణమైన క్షిపణిని పోలిఉందని పేర్కొన్నట్లు ఆ వార్తాసంస్థ తెలిపింది.

రష్యా బొగ్గు దిగుమతులపై ఇయు నిషేధం

రష్యాను కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలుతమ ఆంక్షల పరంపరను కొనసాగిస్తున్నాయి. తాజాగా రష్యానుంచి బొగ్గు, కలప, రసాయనాలు, ఆయా ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం తో పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు ఐదో ప్యాకేజిని ఇయు అధికారికంగా ఆమోదించింది. రష్యా వాణిజ్య రంగాన్ని మరింత దెబ్బతీసేలా ఆ దేశ ఓడలు, ట్రక్కులు ఇయు దేశాల్లో ప్రవేశించకుండా ఈ ఆంక్షలు అడ్డుకుంటాయి. విటిబి సహా నాలుగు రష్యన్ బ్యాంకులతో అన్ని లావాదేవీలను ఇవి నిషేధిస్తాయి. రష్యా ఇంధన రంగంపై ఎక్కువగా ఆధారపడిన ఇయు ఆ దేశ బొగ్గు దిగుమతులపై నిషేధం విధించడం ఇదే మొదటిసారి. అలాగే రష్యా , బెలారస్‌కు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు,సంస్థలకు చెందిన 32 బిలియన్ డాలర్ల ఆస్తులను ఇయు సభ్యదేశాలు ఇప్పటివరకు స్తంభింపజేసినట్లు ఇయుఫ్రాజ్ అండ్ సీజ్ టాస్క్‌ఫోర్స్ శుక్రవారం ప్రకటించింది.

పుతిన్ కుమార్తెలపై బ్రిటన్ సైతం ఆంక్షలు

అమెరికా బాటలో నడుస్తూ బ్రిటన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కుమార్తెలు కాథరీనా వ్లాదిమిరోవ్న టిఖోనోవ, వ్లాదిమిర్నోవ వోరోన్‌త్సోవలపై ఆంక్షలు విధించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కుమార్తె యెకథెరినా సెర్గెవ్నా వినోకురోవానూ ఈ జాబితాలో చేర్చింది. మరో వైపు 8 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు జపాన్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News