Saturday, May 4, 2024

వరల్డ్‌కప్ తర్వాతే రిటైర్మెంట్

- Advertisement -
- Advertisement -

Mithali Raj made clear about his retirement

 

న్యూఢిల్లీ : తన రిటైర్మెంట్ గురించి భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టత ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని స్పష్టం చేసింది. 2021లో న్యూజిలాండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటానని వెల్లడించింది. ఇక, కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన తనకు ఇప్పటికీ ప్రపంచకప్ ట్రోఫీ కలగానే మిగిలి పోయిందని చెప్పింది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో ఆ కలను సాకారం చేసుకుంటాననే ధీమాను వ్యక్తం చేసింది.

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు దక్కాయని తెలిపింది. అయితే ప్రపంచకప్ కల మాత్రం ఇంకా సాకారం కాలేదని పేర్కొంది. ఈ కలను నెరవేర్చుకోవడమే తన ఏకైక లక్షమని మిథాలీ స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత మహిళా జట్టు సమతూకంగా ఉందని వివరించింది. వరల్డ్‌కప్ గెలిచే సత్తా ప్రస్తుత జట్టుకు ఉందని తెలిపింది. సమష్టిగా రాణిస్తే వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో విజేతగా నిలువడం తమకు కష్టమేమీ కాదని పేర్కొంది. కిందటి ప్రపంచకప్ ఫైనల్లో తాము పోరాడి ఓడామని ఈసారి ఎలాగైన ట్రోఫీని గెలుచుకుంటామనే ధీమాను మిథాలీ వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News