Sunday, April 28, 2024

అజ్ఞానం కన్నా అహంకారం మరింత ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Rahul critical of Central Government attitude on Lockdown

 

లాక్‌డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాహుల్ వ్యాఖ్య

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ అజ్ఞానం కన్నా అహంకారం చాలా ప్రమాదమని లాక్‌డౌన్ నిరూపిస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్రం అమలు చేసిన నాలుగు దశల లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో కరోనా వల్ల ఎన్ని మరణాలు పెరిగాయో వివరించే గ్రాఫ్ ను పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ల వల్ల అనుకున్న ఫలితాలు రాలేదు సరికదా ఎన్నో వైఫల్యాలు కనిపించాయని విమర్శించారు. ఆర్థిక స్థితి దిగజారడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, తిరిగి కోలుకోడానికి ప్రజలకు నేరుగా నగదు అందించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News