Friday, April 26, 2024

జాతీయ పార్టీలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నాయి..

- Advertisement -
- Advertisement -

MLA Balka Suman slams Congress Party

హైదరాబాద్: జాతీయ పార్టీలు తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్.. ”దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయి. ఇప్పుడు రెండు పార్టీల నుండి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారు.తెలంగాణ కోసం కొట్లాడింది టీఆర్ఎస్.. చావునోట్లో తలపెట్టింది కేసీఆర్. అసలు ఉద్యమంలో లేనోడు.. చంద్రబాబు ఏజెంట్ రేవంత్, ఉద్యమంలో రాజీనామాలు చేయని ఉత్తమ్, పొన్నాలలు తెలంగాణకు మంచి చేస్తారట. బండి, కిషన్, అరవింద్ అనెటోళ్లకు తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేదు. హాంద్రీనీవాకు హారతి పట్టిన డీకే అరుణలు కేసీఆర్ ను తిడ్తరు. జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణలో గుణాత్మక మార్పుకు కేసీఆర్ శ్రీకారం చుట్టడం జాతీయ పార్టీలకు రుచించడం లేదు. తెలంగాణ పథకాలు, అభివృద్ధిని పక్క రాష్ట్రాల కాంగ్రెస్, బీజేపీ మంత్రులు, కేంద్రం అభినందించి వాస్తవం కాదా. తెలంగాణ మోడల్, అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు తమిళనాడు ద్రవిడ పార్టీల తరహాలో తెలంగాణ సమాజం సిద్దం కావాలి. తెలంగాణ ప్రాజెక్టులు జాతీయహోదా కావాలని, పలు యూనివర్శిటీలు, పరిశ్రమలు కావాలని ఒక్క కాంగ్రెస్, బీజేపీ నేత మాట్లాడడు. కాంగ్రెస్, బీజేపీ సభల్లో జై తెలంగాణ అని వినిపించదు .. అమరులకు నివాళులు అర్పించరు. ఉద్యోగాల భర్తీ గురించి, తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల గురించి, బీజేపీ తెలంగాణకు చేస్తున్న అన్యాయాల గురించి కాంగ్రెస్ సభలో ఎందుకు ప్రశ్నించలేదు. గాంధీ కుటుంబ పరివార్ గా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడు.. కాంగ్రెస్ లో ఐదో తరం మనిషి రాహుల్. అవినీతికి పర్యాయపదం, కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ను ఏకంగా స్కాంగ్రెస్ అని పిలిచారు. మోడీ హామీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మీద పోరాడండి. పోరాడాల్సిన చోట పోరాడకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది. తెలంగాణ సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులు ప్రైవేటుపరం చేస్తున్నారు దానికి మోడీ సమాధానం చెప్పాలి. మోడీ రొటీన్ రాజకీయ ప్రసంగాలు చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు.. తెలంగాణకు ఏం చేస్తారో చెప్పాలి. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి అయోగ్ సిఫార్సు చేసింది.  ఎవరు వచ్చినా, పోయినా తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజల సేవలో నిమగ్నమయ్యేది టీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే.. రాహుల్ సన్నిహిత స్నేహితులంతా బీజేపీలో చేరారు” అని పేర్కొన్నారు.

MLA Balka Suman slams Congress Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News