Friday, May 10, 2024

బిజెపి, కాంగ్రెస్‌లకు ఎప్పుడూ ఓట్లు, నోట్ల గొడవే

- Advertisement -
- Advertisement -

చేపూరు: బిజెపి, కాంగ్రెస్‌లకు ఎప్పుడూ ఓట్లు, నోట్ల గొడవే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రజలంటే చులకన భావం ఉందన్నారు. బిఆర్‌ఎస్ లా ప్రజల కోసమే పని చేసే మంచి బుద్ది కాంగ్రెస్, బిజెపిలకు కొరవడిందన్నారు. అవి ఓటేసిన ప్రజలనే కాటేసే పార్టీలని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్ అంటేనే బలహీన వర్గాలు, రైతుల సంక్షేమన్నారు. కెసిఆర్ జమానా అభివృద్ధికి నమూనా అని సబ్బండ వర్గాలన్నీ సారు కారు కెసిఆర్, బిఆర్‌ఎస్ వైపే చూస్తున్నయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజలు కాంగ్రెస్, బిజెపి నేతల మాయంలో పడొద్దన్నారు. కన్న తండ్రికే తిండి పెట్టనోడు మిమ్మల్ని ఉద్దరిస్తాడా? ఎంపి అర్వింద్ ఒక నయవంచకుడు ఒకే కొంపలో మూడు కుంపట్లు మూడు పార్టీలు సొంతింటినే రచ్చకీడ్చుకున్న ఈ ప్రబుద్దులా ప్రజలకు మేలు చేసేది. బిజెపి ఒక విష వలయం. కాంగ్రెస్ అవినీతికి నిలయం అన్నారు. మళ్లీ మళ్లీ విజయం బిఆర్‌ఎస్‌దే ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తా అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జీవన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఈసందర్భంగా జీవన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపిపి పస్కా నర్సయ్య, జెడ్పీటిసి సంతోష్, సర్పంచ్ సాయన్న, ఎంపిటిసి బాల నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, విడిసి అద్యక్షుడు రిక్కలా రాజారెడ్డి, మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్, బిఆర్‌ఎస్పీ నాయకులు షాహిద్, గంగాధర్, నాగరాజు, బిఆర్‌ఎస్ నాయకులు సిందుకర్ చరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News